Wednesday, April 24, 2024

జగనన్న స్వచ్ఛ సంకల్పం..పరిశుభ్రమైన గ్రామాలే లక్ష్యం

ఆరోగ్యవంతమైన గ్రామసీమలే లక్ష్యంగా క్లాప్, జగనన్న స్వచ్ఛసంకల్పం కార్యక్రమాన్ని శ్రీకారం చూట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన సీఎం జగన్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. గ్రామ పంచాయతీల స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలకు అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ ద్వారా సమకూరుస్తోందని అన్నారు. జగనన్న స్వచ్ఛసంకల్పం విజయవంతం కావాలంటే దానిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి వంద రోజుల పాటు ఒక ఉద్యమంగా గ్రామస్థాయిలో కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపిపి, ఎంపిటిసి, జెడ్పీటిసి, జెడ్పీ చైర్మన్‌లను కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని అన్నారు.

రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారయంత్రాంగం సిద్దంగా ఉండాలని అన్నారు. గ్రీన్‌గార్డ్స్, అంబాసిడర్లను అవసరంను బట్టి నియమించుకోవాలని అన్నారు. గతంలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశుభ్రతా పక్షోత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ గ్రామాలను శుభ్రంగా ఉంచుకునేందుకు నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలకు తమవంతుగా విరాళాలు కూడా అందచేశారని అన్నారు. కొత్తగా పంచాయతీ స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు సభ్యులు ఎన్నికైన నేపథ్యంలో వారి సహకారంతో మరింత సమర్థంగా పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు, మంచినీరు, పచ్చదనం వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: Gulab Cyclone: ప్రకృతి ప్రకోపం.. రైతన్నలకు అపార నష్టం..

Advertisement

తాజా వార్తలు

Advertisement