Sunday, March 26, 2023

శాస‌న‌మండ‌లిలో మంత్రి అప్ప‌ల‌రాజు వ‌ర్సెస్ నారా లోకేష్

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. చేనేత కార్మికుల ఆత్మహత్యలపై చర్చ సంద‌ర్భంగా ఏపీ శాసనమండలిలో మంత్రి సీదిరి అప్పలరాజు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చేనేత కార్మికుల ఆత్మహత్యల పరిహారాన్ని టీడీపీ హయాంలో ఎందుకు పెంచలేదని మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఇప్పుడు చేనేతకు ఈ ఏడాది ఎంత సబ్సిడీ ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. అయితే లోకేష్ ప్రశ్నకు మంత్రి సమాధానం దాటవేసి గతంలో మీరేం చేశారు అంటూ ఎదరు ప్రశ్నవేస్తూ… సబ్సిడీ కోసం నిధులు కేటాయించామని, ఇంకా విడుదల చేయాల్సి ఉందని మంత్రి అప్పలరాజు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement