Friday, April 19, 2024

ముంపు ప్రాంతాల్లో మంత్రి మేకపాటి పర్యటన

ఆత్మకూరు నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో రెండో రోజు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. అనంతసాగరం మండలం, సోమశిల ప్రాజెక్టు, ప్రాచీన సోమేశ్వర ఆలయం ముంపు ప్రాంతాలలో మంత్రి పర్యటిస్తున్నారు. బండారుపల్లిలో నీట మునిగిన పొలాలను, బ్రిడ్జిని మంత్రి మేకపాటి పరిశీలించనున్నారు. మంత్రి మేకపాటితో పాటు నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తదితరులు పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement