Friday, October 22, 2021

దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు: మంత్రి కన్నబాబు

దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు ఏపీ  వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం పలు ఆదేశాలిచ్చారని తెలిపారు. ప్రతి రైతు భరోసా కేంద్రం.. సబ్‌ డీలర్‌గా ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: ఇండ్లు లేని వారికి రూ.5 లక్షలు.. తెలంగాణలో కొత్త పథకం!

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News