Friday, March 29, 2024

వైసీపీపై ఏ యుద్ధం చేస్తారు?: పవన్ కు మంత్రి కన్నాబాబు ప్రశ్న

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన శ్రమదానాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి కన్నబాబు అన్నారు. శ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేశారని తెలిపారు. ఈ తరహా శ్రమదానం పవన్‌ ఒక్కరే చేయగలరేమో అని ఎద్దేవా చేశారు. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం రూ. 2,200 కోట్లు కేటాయించారని… వర్షాలు తగ్గిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారని గుర్తు చేశారు. వైసీపీపై యుద్ధం ప్రకటించానని చెబుతున్న పవన్‌.. ఏ కారణంతో ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కోవిడ్‌ సమయంలో పేదలను ఆదుకున్నందుకు యుద్దం చేయాలా? అని నిలదీశారు.

ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివాళ్లే యుద్ధం గురించి మాట్లాడతారని మంత్రి విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో జగన్ చెప్పారని… ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారనే విషయం అర్థమయిందని చెప్పారు. జగన్ కు ఒక కులాన్ని ఆపాదించి లబ్ధిపొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాదులో ఉంటున్న పవన్ కు ఏపీ పరిస్థితులు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం మంత్రి కన్నాబాబు అన్నారు.  సీఎంకు రాష్ట్ర ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో కులాల మధ్య సామరస్యత ఉందని, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి న్యాయం చేస్తున్నామని అన్నారు. కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. 

ఇది కూడా చదవండిః ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా.. జిల్లాల్లో నమోదైన కేసులు ఇవే..

Advertisement

తాజా వార్తలు

Advertisement