Friday, April 19, 2024

బీసీల్లోని 139 కులాలకు సమతుల్యత: మంత్రి

రాష్ట్రంలో బీసీల్లోని 139 కులాలకు సమతుల్యత పాటించే ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యలయంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జాల రామకృష్ణ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బలహీనవర్గానికి ఆస్తులు ఉండవని, వృత్తులు ఉంటాయన్నారు. ఆ వృత్తులను ప్రోత్సహించి సంరక్షించే బాధ్యత వైసీపీ ప్రభుత్వం తీసుకుందన్నారు. సీఎం జగన్‌ సంక్షేమ పాలనను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారని అన్నారు. దుష్ప్రచారాలను మనందరం కలిసి తిప్పి కొట్టాలన్నారు. దుర్గ గుడి నాయి బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తాను అని చంద్రబాబు దుర్బాషలాడారని మండిపడ్డారు. అదే నాయి బ్రాహ్మణి మహిళను దుర్గ గుడిలో డైరక్టర్ చేసి వారి ఆత్మగౌరవం నిలిపిన నాయకులు సీఎం జగన్ అని తెలిపారు. బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపే దిశగా పాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రికి ఓ బలహీనవర్గానికి చెందిన వ్యక్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. చంద్రబాబు హయంలో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సీం జగన్ పాదయాత్రలో 139 కులాల కోసం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. భావితారాల భవిష్యత్తు గురించి ఆలోచించే ఏకైక సీఎం జగన్ మాత్రమేనని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement