Wednesday, April 24, 2024

ఏ క్షణమైనా మూడు రాజధానుల ఏర్పాటు: బొత్స కీలక వ్యాఖ్య

ఏపీలో ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వీటికి సంబంధించిన పనులు ఇప్పటికే శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు తరువాత సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని మంత్రి బొత్స  చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటును కొంత మంది దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. శాసనసభలో ఏ చట్టం చేశామో అదే జరిగి తీరుతుందని బొత్స స్పష్టం చేశారు. అమరావతి నుంచి రాజధాని వెళ్లకూడదని టీడీపీ నేతల కోరిక అని, వాళ్లది పైశాచిక ఆనందమని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

కాగా, మూడు రాజధానుల అంశంపై ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో.. త్వరలోనే పరిపాలనా రాజధాని విశాఖకు వస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడినుంచైనా పాలన చేయవచ్చని అన్నారు. ఏపీ పరిపాలనా రాజధాని విశాఖకు తప్పకుండా వస్తుందని పునరుద్ఘాటించారు. సీఆర్డీఏ చట్టానికి మూడు రాజధానులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement