Thursday, April 18, 2024

వైద్య మంత్రి ఆదేశాలతో నిలిచిన మహిళ ప్రాణం

ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో బ్లాక్ ఫంగస్ సోకిన ఓ మహిళ ప్రాణం నిలిచింది. మంత్రి ఆదేశాలతో స్పందించన ఒంగోలు జీజీహెచ్ ఆస్పత్రి వైద్యులు.. బ్లాక్ ఫంగస్ తో ప్రాణాపాయంతో కొట్టు మిట్టడుతున్న పద్మకు చికిత్స అందించారు. ప్రాణంపై ఆశ వదులుకున్న పద్మను ఆదుకొని తక్షణమే స్పందించి వైద్య సదుపాయం కల్పించిన మంత్రికి బాధిత మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెoదిన ఓ ఆటో డ్రైవర్ భార్య పద్మకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే, సదరు ప్రైవేట్ హాస్పిటల్ లో రెండున్నర లక్షలు తీసుకొని వైద్యం అందించకుండా డిశ్చార్జ్ చేశారు. దీంతో దిక్కు తోచని పరిస్థితిలో ప్రాణాన్ని అర చేతిలో పెట్టుకొని తీవ్ర అనారోగ్యంతో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లిన పద్మ కుడాక్టర్స్ నిబంధనలు పేరుతో చుక్కలు చూపించారు. ఒంగోలులో వైస్సార్సీపీ కార్యకర్త నరాల రమణ రెడ్డికి బ్లాక్ ఫంగస్ సోకిన పద్మ కుటుంబ సభ్యులు ఫోన్ లో వైద్య సహాయం కోరారు. వెంటనే ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ కి బాధిత మహిళను వైద్యం కోసం పంపిస్తే.. నిబంధనలు పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. ఆధార్ కార్డులో కృష్ణా జిల్లా అని ఉండడంతో ఒంగోలు జీజీహెచ్ వైద్యులు ఆస్పత్రిలో చేర్చుకుంనేందుకు నిరాకరించారు. అయితే, ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని.. తక్షణమే స్పందించారు. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రాములతో ఫోన్ లో మాట్లాడి వెంటనే పద్మను జాయిన్ చేసుకొని మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. మంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో బ్లాక్ ఫంగస్ బాధితురాలని ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement