Friday, October 4, 2024

Mining Scam – చిన్న చేప‌ను కాదు తిమింగ‌లాన్ని పట్టుకోండి .. పిసిపి చీఫ్ ష‌ర్మిల

గ‌నుల అక్ర‌మాల‌పై సిబిఐ విచార‌ణ జ‌ర‌పాల్సిందే
వెంక‌ట‌రెడ్డి వెనుకు అస‌లు సూత్ర‌ధారి ఎవ‌రో అంద‌రికీ తెలుసు
గ‌నుల‌ను మింగేసిన ప్యాలెస్ నేత‌పై దృష్టి పెట్టండి
ఎపి ప్ర‌భుత్వానికి పిసిపి చీఫ్ ష‌ర్మిల విన‌తి

అమ‌రావ‌తి – గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన మైనింగ్ మాఫియా నేత‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఎపిపిసిసి చీఫ్ ష‌ర్మిల డిమాండ్ చేశారు..ఈ స్కామ్ లో గనులశాఖ (ఏపీఎండీసీ) మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన దానిపై ఆమె స్పందిస్తూ ట్విట్ చేశారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా, పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని స్పష్టంచేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, తెరవెనుక ఉండి అన్నీ తానై వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనాపాఠి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల వివరించారు.

“ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు… నిబంధనలను బేఖాతరు చేసి వారు అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఎన్జీటీ నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ స్కాంపై ఏసీబీతో విచారణతో పాటు, సమగ్ర దర్యాప్తు జరిపించాలి. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరులపై దోపిడీపై సీబీఐ విచారణ కోరండి” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement