Wednesday, March 27, 2024

చిరు అభిమానికి మెగా సాయం.. ఫ్లైట్ టిక్కెట్ ఇచ్చి మ‌రీ..

Megastar: చిరంజీవి తన అభిమానులకు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటార‌న‌డంలో సందేహం లేదు. ఆపద వచ్చిందని ఎవరూ తలుపుతట్టినా ఆదుకుంటారాయ‌న‌. తాజాగా జ‌రిగిన ఓ ఇన్సిడెంటే దానికి నిద‌ర్శ‌నంగా చెప్పుకోవ‌చ్చు. హెల్త్ బాగాలేక బాధపడుతున్న ఓ అభిమానికి సాయం అందించారు చిరంజీవి.

విశాఖ జిల్లాకు చెందిన వెంకట్‌ కొంతకాలంగా కేన్సర్‌ వ్యాధితో పోరాడుతున్నాడు. అయితే తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలని నిశ్చయించుకున్నాడు వెంకటేష్‌. ట్విట్టర్‌ ద్వారా మిమ్మల్ని కలవాలి సర్‌ అంటూ వెంకటేష్‌ రిక్వెస్ట్‌ చేశారు. ఆ ట్వీట్‌ చూసిన మెగాస్టార్‌ వెంటనే స్పందించారు.

వెంకట్‌ ఆయన భార్య సుజాతకు ఫ్లైట్‌ టికెట్స్ పంపించారు చిరంజీవి. వారిని హైదరాబాద్‌లోని తన ఇంటికి రప్పించి వారితో 45నిమిషాలు మాట్లాడారు. వెంకట్‌ అనారోగ్యం గురించి తెలుసుకొని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిరు ఇంటి నుంచి వారిని నేరుగా ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి పంపించారు.

అక్కడి డాక్టర్లతో మాట్లాడి వెంకట్‌ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఇక చికిత్స అయ్యే ఖర్చునంత తానే భరిస్తానని వెంకట్‌ ఫ్యామిలీకి చిరంజీవి భరోసా ఇచ్చారు. మెగాస్టార్‌ దాతృత్వాన్ని చూసిన మెగా అభిమానులు దటీజ్‌ చిరంజీవి అంటూ కొనియాడుతున్నారు.

తన అభిమానిగా ఉన్నందుకు గ్వరంగా ఉందని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. తమ తోటి అభిమాని అయిన వెంకట్‌ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement