Sunday, March 24, 2024

నోటిఫికేషన్ ల జాత‌ర‌.. వేగంగా సాగుతున్న నియామక ప్రక్రియ

వైద్య, ఆరోగ్య శాఖలో కొత్త సంస్కరణలు తీసుకువస్తూ సర్కారీ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని పేదలకు అందించే లక్ష్యంతో వాటి బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న మానవ వనరుల కొరతను పూర్తిస్థాయిలో అధిగమించేందుకు సమగ్రమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వ వైద్యశాలలతో పాటు బోధనాసుపత్రులలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కొత్త పోస్టులను కూడా సృష్టించి మంజూరు చేస్తున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 9700 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 5854 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించడంతో ఇప్పటికే ఈ నోటిఫికేషన్‌ను కూడా విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో 1554 పోస్టులతో పాటు వివిధ జిల్లాల్లో 4300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించి ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో 590 పోస్టులు, వైద్య విద్యలో 68 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో మరో 896 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడు దలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 9557 మంది ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులను వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేశారు. ప్రజారోగ్య విభాగంతో పాటు వైద్య విద్య, వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న పోస్టులకు కూడా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ దరఖాస్తులన్నింటినీ వచ్చే ఏడాది జనవరి 10వ తేదీలోగా పరిశీలించి నియామక ప్రక్రియను చేపట్టేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. మరికొన్ని పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియను వచ్చే ఏడాది జనవరి 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement