Monday, April 15, 2024

AP: మైనర్ బాలికకు పెళ్లి, గర్భం, అబార్షన్.. పెద్దలు కుదిరిచ్చిన సంబంధంలో అందరూ దోషులే

పాయకాపురం, (ప్రభ న్యూస్) : ఓ మైనర్ బాలికకు (17) వివాహం జ‌రిపించిన ఘ‌ట‌న‌లో మొత్తం కుటుంబం అంతా ఇప్పుడు బాధితులుగా మారారు. చిన్న ఏజ్‌లోనే ఆ బాలిక గర్భవతి అయ్యింది. అయితే.. కారణాలు చాలా గొప్యంగా ఉన్నప్పటికీ ఆ బాలిక తన గర్భం పోవడానికి మెడిసిన్ వాడింద‌ని, తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో సీరియ‌స్ కండిష‌న్ మ‌ధ్య‌ కొట్టమిట్టాడుతున్న‌ట్టు సమాచారం. ఈ కేసును ఏపీలోని కృష్ణా జిల్లా నున్న పోలీసులు అత్యంత గొప్యంగా ధర్యాప్తు చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే బాలిక తరుపు అమ్ముమ్మ ఈ విష‌య‌మై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ బాలికకు పెద్దలు కుదిరిచ్చిన సంబంధం కాబట్టి, అందరూ ఈ కేసులో దోషులుగా ఉన్నారు. అమ్ముమ్మ కూడా దోషిగానే ఉంది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement