Thursday, April 18, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న నైరుతి

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది విశాఖ వాతావరణ కేంద్రం. జూన్ 3 న కేరళలో ప్రవేశించించిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింతగా విస్తరిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే అనంతపురం & చిత్తూరు జిల్లాల్లోకి ప్రవేసించిన రుతుపవనాలు..తాజాగా కర్నూలు,కడప & తిరుపతి లోకి ప్రవేశించాయి. రాయలసీమలో ఇప్పటికే గత 3 రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాచి. ఇటు తెలంగాణలోను రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.

బెంగళూరుతోపాటు ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి మలెనాడు ప్రాంతాలైన శివమొగ్గ, కొడగు సహా ఉత్తరకర్ణాటకలో భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 17 జిల్లాలను ఎల్లో అలర్ట్‌గా ప్రకటించారు. నైరుతి ప్రభావంతో బెంగళూరులో విస్తారంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచే నగరవ్యాప్తంగా వర్షం కురిసింది. ఉత్తర కర్ణాటకలోని హుబ్బళ్లి, ధార్వాడ ప్రాంతాలలో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement