Friday, April 19, 2024

ఉమ్మడి కడపలోకి ప్రవేశించిన మాండస్ తుఫాన్.. ఆందోళనలో రైతులు


కడప, ఆంధ్రప్రభ బ్యూరో : ఉమ్మడి కడప జిల్లాలో కి మాండస్‌ తుఫాన్ ప్రవేశించింది.శుక్రవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలుకురుస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగంఅప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలను పరిశీలించిముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులనుదేశించింది. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసింది.ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితేవెంటనే కంట్రోల్ రూమ్ ల ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.నిజిల్లాలోని నదులు ,వంకలు,వాగులు ఉన్న ప్రాంతాల్లోఅధికారులు పర్యటించి అక్కడ ముందస్తు చర్యలు చేపట్టాలనిఅధికారులకు సూచించారు. మాండస్ తుఫాను ప్రభావంతో ప్రధానంగా వైయస్సార్ జిల్లా వరి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనే అవకాశం ఉంది. మునుగోలుగా సాగుచేసిన వరి పంటకోతకు వచ్చింది. ఈ ధాన్యం పంటపొలాల్లోనే ఉంది. వర్షాలు రావడంతో ధాన్యాన్ని కుప్పలుగా పోసి పాల్ధిన్ పట్టలు కప్పుకొని అక్కడే కాపలా ఉంటున్నారు.

వరి ధాన్యం తడిసిపోతే దాన్యాన్ని కొనేవ్యాపారులు ముందుకు రారన్న ఆందోళన రైతుల్లో వ్యక్తం మవుతోంది. బ్రహ్మంగారిమఠం మండలం దిగువ నేలటూరు గ్రామంలో గత రెండు రోజులుగాకోసిన వరి ధాన్యం కలాల్లోనే ఉండడంతోఆ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆలస్యంగా సాగుచేసిన వరి కూడా గింజలు పట్టే సమయం ఉండడంతో వర్షాలకు పంట మునిగితే తెగుళ్లు సోకి పంట దెబ్బతింటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.వరితో పాటుు ప్రధానంగావేరుశనగ, పత్తి బుడ్డ సెనగ,చిరు ధాన్యాలుసాగు చేశారు.ఈ పంటలు నష్టపోతాయి అన్న ఆందోళన రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది.మరో రెండు మూడు రోజుల పాటు మాండస్ తుఫాను కొనసాగ నుండడంతో జిల్లాలో రైతులతో పాటు,ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement