Thursday, March 28, 2024

ఆనందయ్యకు సెల్యూట్: మద్రాస్ హైకోర్టు

సెకండ్ వేవ్‌లో కరోనా విజృంభించిన వేళ నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య మందుపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. కరోనా బాధితులు ఆనందయ్య మందుతో కోలుకున్నారు. ఆనందయ్య కీర్తి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు పాకింది. తాజాగా ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం మద్రాస్ హైకోర్టులో డీఆర్డీఓ తయారు చేసిన 2 డీజీ మందుపై విచారణ సందర్భంగా ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఏపీలో కరోనాకు మందు తయారు చేసి ఉచితంగా ఇస్తున్నారని అభినందించింది. ఈ సందర్భంగా ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్ తమిళ్ సెల్వి, జస్టిస్ కరుణాకరణ్ సెల్యూట్ చేశారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ ఆనందయ్యను అభినందించారు. ఆయుర్వేద వైద్యులను కేంద్రం ప్రోత్సహించాలని మద్రాస్ హైకోర్టు పేర్కొంది.

కాగా, నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా నివారణకు తయారు చేసిన మందు పంపిణీ ప్రస్తుతం కొనసాగుతోంది. కంట్లో వేసే డ్రాప్స్‌ మినహా మిగిలిన అన్ని రకాల మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి: బీ అలర్ట్.. ఏపీలో తొలి డెల్టా ప్లస్ కేసు నమోదు

Advertisement

తాజా వార్తలు

Advertisement