Saturday, April 20, 2024

Low BP – మ‌రోసారి వైఎస్ భాస్కర్ రెడ్డికి బిపి డౌన్ .. నిమ్స్ లో చికిత్స

హైద‌రాబాద్ – వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయి చంచల్ గూడ జైలులో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వివేకా హత్య కేసులో కీలక నిందితుడుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈక్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావటంతో జైలు సిబ్బంది డాక్టర్ల సూచననలతో ఆయన్ని నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, నిన్న కూడా భాస్కర్‌రెడ్డికి బీపీ పెరగడంతో ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే జైలు అధికారులు భాస్కర్‌ రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి అనంతరం చంచల్‌గూడ జైలుకు తిరిగి తీసుకొచ్చారు.అయినా ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగు పడకపోవడంతో మరోసారి శనివారం ఉదయం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. అక్క‌డ ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. అలాగే అవినాష్ త‌ల్లి శ్రీల‌క్ష్మీ చికిత్స కోసం నిన్న హైద‌రాబాద్ లోని ఎఐజి లో చేరారు.. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుగా ఉంద‌ని వైద్యుల వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement