Thursday, April 25, 2024

ఆత్మకూరులో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విషాదం చోటు చేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. సోమా నవీన్, ఆయేషా గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లిని పెద్దలు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పొలానికి వెళ్లి విషం తీసుకున్నారు. అయితే, అపస్మారక స్థితిలో ఉన్న ఇరువురినీ స్థానికులు వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ప్రేమికులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement