Tuesday, March 26, 2024

ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర .. కొడాలి నాని

లోకేష్ పాదయాత్ర ఏ అర్హతతో చేస్తున్నాడని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ… లోకేష్ మొదట ఎమ్మెల్యేగా గెలవాలన్నారు. శాసనసభ్యుడిగా ఓడిపోయిన వాడు పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉండి పాదయాత్ర చేయాలన్నారు. లోకేష్ పాదయాత్ర టీడీపీకే ఉపయోగం లేదన్నారు. టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర అన్నారు. ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. ఎన్టీఆర్ వారసుల నుండి లాక్కునేందుకే లోకేష్ పాదయాత్ర అన్నారు. చంద్రబాబుకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబుకు వయస్సు అయిపోయింది.. అందుకే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement