Wednesday, April 24, 2024

Breaking: వీటీపీఎస్ లో కూలిన లిఫ్ట్.. ఇద్దరు దుర్మరణం..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : జిల్లాలో కొండపల్లిలో ఉన్న విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎన్ టి పి సి ఐదవ ఫేజ్ నిర్మాణ పనులు గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న సందర్భంలో రెండు సంవత్సరాల క్రితం పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ నిర్మాణ పనుల కోసం లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. నిర్మాణ దశ పూర్తిగా చివరి దశకు రావడంతో పై భాగంలో పనులు చేసేందుకు లిఫ్ట్ లో ఉదయం 15 మంది కార్మికులు పైకి వెళుతున్న సందర్భంగా నాలుగో ఫ్లోర్ వద్ద లిఫ్ట్ కు అంతరాయం కలిగింది. ఈ దశలో ఆందోళన చెందిన కార్మికులు తలుపులు తీసుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే బరువుకి వైర్లు తెగడంతో ఒక్కసారిగా లిఫ్టు కిందకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరికొందరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. లిఫ్ట్ ఆగిన తర్వాత మరమ్మత్తులు చేసేందుకు సిబ్బంది కింద ప్రయత్నిస్తున్న సందర్భంలో లిఫ్ట్ పైనుంచి కింద పడినట్లుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులు చెబుతున్నారు. లిఫ్ట్ పూర్తిగా తొలగించిన తర్వాత కానీ కింద ఎంతమంది ప్రమాదంలో చిక్కుకున్నారో వారిని అంచనాకు రావడం కష్టంగా ఉందని అధికారులు అంటున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఎన్టీపీసీ లోని ఆసుపత్రిలో వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement