Tuesday, May 30, 2023

AP: రైతులకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు.. హాజరైన గవర్నర్ బిశ్వభూషణ్

సామాన్యుల్లోని అసమాన్యుల సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులను గర్వకారణంగా నిలుస్తాయని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజంలో అసమాన్య సేవలు అందిస్తున్న ప్రముఖులు, మానవతా మూర్తులకు అభినందనలు తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌) అత్యున్నత అవార్డులను ప్రదానం చేశారు. ప్రత్యేక ఉన్నత పురస్కారాలను వ్యక్తులుగా, సంస్ధలుగా వారు చేసిన గొప్ప సేవలకు గుర్తింపుగా ఇస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

- Advertisement -
   

రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గవర్నర్ ముఖ్య అతిథిగా జరిగిన వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మందికి (౩౦ సంస్థలకు) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం జగన్ తో కలిసి అవార్డులు ప్రదానం చేశారు. వ్యవసాయం, కళలు, సంస్కృతి, సాహిత్యం, మహిళా శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్ధలకు 20 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement