Saturday, December 7, 2024

Lady Fan – పవన్ గెల‌వాలి … మోకాళ్లపై న‌డుస్తూ తిరుమలకు

ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు మూడు రోజుల్లో వెలువ‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం సాధించాల‌ని కోరుతూ తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఓ యువ‌తి మోకాళ్ల‌పై మెట్లు ఎక్కి తిరుమ‌లకు చేరుకున్నారు. ఉండ్రాజ‌వ‌రానికి చెందిన ఆర్ఎంపీ డాక్ట‌ర్‌ ప‌సుపులేటి దుర్గా రామ‌లక్ష్మికి ప‌వ‌న్ అంటే ఎన‌లేని అభిమానం. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని గెల‌వాల‌ని ఆమె తిరుమ‌ల శ్రీవారిని మెక్కుకున్నారు.

అందులో భాగంగా మోకాళ్లపై మెట్టు ఎక్కి తిరుమ‌ల‌కు చేరుకుని శ్రీవారి మొక్కు తీర్చిన‌ట్లు రామ‌లక్ష్మి తెలిపారు. పార్టీల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని, కేవ‌లం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా మోకాళ్ల‌పై మెట్లు ఎక్కిన‌ట్లు చెప్పారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయ‌న భారీ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement