Sunday, February 5, 2023

వైభవంగా శ్రీ సుజయీంద్ర తీర్థుల ఆరాధన మ‌హోత్స‌వం

మంత్రాలయం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో నవ మంత్రాలయ నిర్మాతగా పేరుగాంచిన పూర్వ పీఠాధిపతులు శ్రీ సుజయీంద్ర తీర్థుల ఆరాధన మహోత్సవం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలోబుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుజయీంద్ర తీర్థుల మూల బృందావనానికి తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. బృందావనానికి పంచామృతాభిషేకం విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణ రథంపై సుజయీంద్ర తీర్థుల చిత్ర పటం ఉంచి మంగళ హారతిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తుల హర్ష ధ్వనుల మధ్య బాజాభజంత్రీల మధ్య మఠం ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పీఠాధిపతి శ్రీ సుజయీంద్ర తీర్థుల జీవితం గుర్తించి. వివరించారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు,భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement