Thursday, March 30, 2023

Traffic Jam : నల్లమల్ల ఘాట్ రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్..

నంద్యాల : కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు గంటల తరబడి ఘాట్ మార్గంలోనే నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లమల్ల అడవుల్లో ఘాట్ రోడ్లో లోడుతో వెళ్తున్న లారీ తిరగబడటమే వీటన్నిటికీ కారణ‌మ‌ని తెలుస్తోంది. భారీ వాహనం చెడిపోవడంతో వాహనాలు అటు ఇటు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఇక శ్రీశైలంకు వెళ్లే ప్రయాణికులతో ఆత్మకూరు బస్టాండ్ లో నిలిచి పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement