Saturday, November 30, 2024

KNL | టిడ్కో గృహాల్లో వసతుల కల్పనకు చర్యలు.. రవీంద్రబాబు

కర్నూల్ బ్యూరో : జగన్నాథ గట్టు వద్దనున్న టిడ్కో గృహాల్లో అవసరమైన వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. సోమవారం అధికారులతో కలిసి కమిషనర్ టిడ్కో గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. టిడ్కో గృహాల్లో 255 బ్లాకుల్లో 10,000 వేల గృహాలు ఉన్నాయన్నారు.

అందులో నివాసముంటున్న లబ్దిదారులు, ఖాళీగా ఉన్న గృహాలకు సంబంధించిన వివరాలతో పాటు విద్యుత్, తాగునీటి కనెక్షన్ వంటి వివరాలను తెలుసుకునేందుకు అధికారులు, సచివాలయ సిబ్బందితో సర్వే చేపట్టామన్నారు. వాటి ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని, అలాగే గృహాల్లో తగు మరమ్మత్తు పనులను చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడ్కో డీఈ గుప్తా, నగర పాలక టిడ్కో స్పెషలిస్ట్ అధికారి పెంచలయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement