Saturday, April 20, 2024

డివైడర్ ను ఢీకొట్టిన స్కూల్ బస్సు… తప్పిన ప్రమాదం

ఏపీలోని నంద్యాల జిల్లాలోని తమ రాజు పల్లె సమీపంలో మూలమెట్ట పెద్దమ్మ తల్లి యూటర్న్ వద్ద విజయానికేతన్ స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులున్నారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన అనంతరం చిన్నారులను ఇళ్ళకు తిరిగి పంపించేశారు. బస్సు డివైడర్ ను ఢీకొట్టడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురవగా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement