Wednesday, March 29, 2023

ఆత్మహత్యనే శరణ్యం..!

రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాలలో హాస్టల్ లో ఉంటూ చదివెందుకు అనుమతించడం లేదంటూ సోమవారం కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు ఆత్మహత్య చేసుకుంటానని రాయలసీమ‌ యూనివర్సిటీలో మూడవ సంవత్సరం చదువుతున్న సురేష్ నాయక్ తన తల్లిదండ్రులతో కలిసి నిరసన చేపట్టారు. అధికారులు తన సమస్య పరిష్కారిoచక పోతే ఆత్మహత్యే శరణ్యం అన్నారు. ఇందుకు రాయలసీమ యూనివర్సిటీ ఉప కులపతి, రిజిస్టార్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కావున నేటి సాయంత్రం లోపు తనకు న్యాయం జరగకపోతే తల్లిదండ్రులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వెల్లడించారు. తక్షణమే ఈ విసయంలో జిల్లా కలెక్టర్ కలుగ జేసుకొని న్యాయం చేయాలని విద్యార్థి, అతని తల్లిదండ్రులు కోరారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement