Friday, March 29, 2024

ప్రత్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు.. 25 నుంచి బస్సు యాత్ర..

కర్నూలు : కర్నూల్ నగరంలోని కలెక్టర్ కార్యాలయం మీడియా భవన్ నందు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో బస్సు జాత జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, పిడిఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సోమన్న ఏవైఎఫ్ నగర కార్యదర్శి బిసన్న మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ మాట తప్పడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆమన దూరంలో నిలిచిపోయిందని తెలిపారు. జనవరి 25వ తేదీ అనంతపురంలో మొదలై ఫిబ్రవరి 4వ తేదీ ఇచ్చాపురం వరకు విద్యార్థి యువజన సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు జాత కర్నూల్ నగరానికి 25వ తేదీ సాయంత్రం 3 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. రాష్ట్ర విడిపోయినప్పుడు బాగా అభివృద్ధి చెందిన హైదరాబాదు తెలంగాణకు వెళ్లడంతో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక తరహ హోదా వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణానికి నిధులు, చెన్నై నుండి శ్రీకాకుళం వరకు కోస్టల్ కారిడార్ నిర్మాణం, రామాయపట్నం పోర్టు నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ విద్య వైద్య సంస్థల నిర్మాణం విశాఖ రైల్వే జోన్ ఇస్తామని, రెవెన్యూ లోటు భర్తీ హామీ ఇచ్చారు. 8 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు భజన హామీల అమలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని దీనివల్ల ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మరియు పరిశ్రమలు లేక భారీగా నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు.

నాకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రం ముందు మెడల్ వంచుతుంది తప్ప హోదా సాధించడం లేదని అన్నారు. కావున కేంద్ర ప్రభుత్వం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తిగా మెతక వైఖరితో ఉన్నాయని తెలిపారు. కాబట్టి విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో యువతను విద్యార్థులను ప్రజానీకాన్ని చైతన్యం చేయడం కోసం బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. బస్సు యాత్రలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చెలసాని శ్రీనివాస్, విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర నాయకులు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. 25వ తేదీ కర్నూల్ లో జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప, పి వై ఎల్ నాయకులు రమేష్, ఏఐవైఎఫ్ నగర నాయకులు బాబయ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు పిడిఎస్యు నాయకులు రమణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement