Tuesday, March 26, 2024

కలుషితాహారం తిని ఏడుగురికి అస్వస్థత.

వెలుగోడు మండల పరిధిలోని గుంతకందాల గ్రామంలో గురువారం విషాహారం తినడం వల్ల 10 మందికి వాంతులు, బేదులు వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి జరిగిన పెళ్లి లో భోజనం చేయడం వల్ల ఇలా జరిగి ఉంటుందా, లేదా బోరింగ్ నీళ్ల వల్ల ఇలా జరిగిందా అనేది వైద్యాధికారులు అంచనా వేయలేక పోతున్నారు. ప్రస్తుతం వెలుగోడులో సిహెచ్ సిలో నలుగురు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు.

మిగిలిన వారు వివిధ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. వైద్యాధికారులు గుంతకంతల గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సేవలు అందించుచున్నారు. బాధితులను అసిస్టెంట్ డీఎంహెచ్ఓ కాంతారావు నాయక్ , వైద్యులు వంశీకృష్ణ ,హెల్త్ సూపర్ వైజర్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా డిఎంహెచ్ఓ వెంకటరమణ రాత్రి 9 గంటల ప్రాంతంలో వెలుగోడు సిఎస్సి గుంతకందల మెడికల్ క్యాంపు సందర్శించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని వారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement