Friday, October 4, 2024

KNL: చంద్రబాబు పాపానికి ప్రక్షాళన… వైసీపీ నేతల పూజలు

కర్నూలు బ్యూరో : శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళన కోరుతూ వైయస్‌ఆర్‌సీపీ నేతలు పూజలు నిర్వహించారు.

కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైసిపి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు తెర్నేకల్ సుదేందర్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బి వై.రామయ్య, వైసిపి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైయస్‌ఆర్‌సీపీ నేతలు పూజలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement