Wednesday, April 24, 2024

టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు : మంత్రి జయరాం

ఆలూరు : లో లెవెల్ కాల్వకు తుంగభద్ర జలాశయం నుండి నవంబర్ ఒకటవ తేదీ నుండి సాగు, తాగు విడుదల చేయిస్తామని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి లో లెవెల్ కాలువ దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా వాళ్లు సంయుక్తంగా మాట్లాడుతూ గత 15 రోజులుగా నో లెవెల్ కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయిన సందర్భంగా రైతులు ఇబ్బంది పడకుండా ఉండేవిధంగా పనులు ముమ్మరంగా జరిపి తొలితగతన రైతులకు నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన కాలువైన ఎల్ ఎల్ సి కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో వరి మిరప పత్తి ఇతర పంటలు కూడా సాగు చేశారు.

కర్ణాటక ఆంధ్రరాష్ట్రం సరిహద్దు ప్రాంతమైన అనంతపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో హగరి (వేదవతి) నదిలో ఈ సంవత్సరం భారీ వరద ప్రభావం ప్రవహించింది. ఈ ప్రభావంతో మోక సరిహద్దు ఎల్ఎల్ సి 121 కిలోమీటర్ వద్ద అదిరినదిపై ప్రవహిస్తున్న ఎల్ఎల్సీ కాలువ పిల్లర్ కొట్టుకోపోవడంతో నీటి ప్రవాహాన్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటివరకు వేదవతి నదిలో నీటి ప్రవాహం తగ్గలేదు. తుంగభద్ర డ్యామ్ బోర్డు అధికారులు కాల్వ మరమ్మతులు పనులు పూర్తి చేశారని నవంబర్ ఒకటవ తేదీ నుండి సాగునీరు అందిస్తామని తుంగభద్ర బోర్డు చీఫ్ ఇంజనీర్ శ్రీకాంత్ రెడ్డి, ఈ ఈ నీలకంఠ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజక ఇంచార్జి నారాయణస్వామి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు, ఆంధ్ర కర్ణాటక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement