Wednesday, December 4, 2024

Nandyala | మహానందిలో అఘోరి పూజలు

నంద్యాల బ్యూరో, నవంబర్ 9 : గత వారం రోజులుగా ఉమ్మడి రాష్ట్రాల్లో మహిళా అఘోరి వివిధ‌ ప్రాంతాల్లో కలియ‌ తిరుగుతూ వస్తుంది. పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ వస్తుంది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో దర్శనమిచ్చింది. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏమీ లేదని మహిళా అఘోరి (నాగ సాధు) పేర్కొన్నారు.

శనివారం ఉదయం మహానంది క్షేత్రంలో అఘోరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అఘోరి మాట్లాడుతూ… తాను లోక కళ్యాణం కోసం క్షేత్రాలను సందర్శిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, భారతదేశంలో పలు శక్తి పీఠాలతో పాటు ప్రముఖ క్షేత్రాలను సందర్శించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే మహానంది క్షేత్రానికి దైవదర్శనం కోసం వచ్చారన్నారు.

దేశంలో స్త్రీలపై అత్యాచారాలు, గో హత్యలను నివారించాలన్నారు. ప్రభుత్వ పెద్దలు కూడా వీటిపైచర్యలు తీసుకొని హిందూ సంప్రదాయాన్ని కాపాడాలని తెలిపారు. అఘోరి రాక వల్ల మహానందిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement