Friday, April 19, 2024

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కర్నూలు బుడతడు

పిట్ట కొంచెం.. కూత ఘనం అంటారు. ఈ సామెత కర్నూలు జిల్లాలోని ఓ బుడతడికి సరిగ్గా సరిపోతుంది. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన చంద్రిక, ప్రశాంత్ కుమార్ దంపతుల కుమారుడు అకీరానందన్ అనే బాలుడిలో ఎంతో మేథాశక్తి దాగి ఉంది. ఆ బాలుడు చదివేది ఎల్‌కేజీ అయినా 11 తెలుగు ప్రాసలు నేర్చుకున్నాడు. దేవుని శ్లోకాలు, తెలుగు పద్యాలు చక్కగా చెప్పేస్తున్నాడు. ఇంగ్లీష్‌ వర్ణమాల, ఆంగ్ల నెలలు, జాతీయ చిహ్నాలు, రుతువుల పేర్లు, జంతువుల పేర్లను చకచకా చెప్పేస్తున్నాడు. జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు టక్కున సమాధానమిచ్చేస్తాడు.

దీంతో అతడి ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు వీడియోలు తీసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకు(ఐబీఆర్) పంపించారు. ఐబీఆర్‌ నిర్వాహకులు అకీరాకు మే నెల 20వ తేదీన ఆన్‌లైన్‌లో టెస్టు నిర్వహించి బాలుడి పేరిట రికార్డు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి మెడల్, సర్టిఫికెట్‌ను నిర్వాహకులు పోస్ట్‌ ద్వారా బాలుడికి పంపారు.

ఈ వార్త కూడా చదవండి: ఫోటో వైరల్: పొలం పనులు చేస్తున్న రఘువీరా మనవరాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement