Friday, March 29, 2024

కె.ఎస్.కేర్ ఆసుపత్రి పై చర్యలు… కలెక్టర్ వీరపాండియన్.

కర్నూల్ బ్యూరో,- కర్నూలు నగరంలో కోవిడ్ ఆసుపత్రిగా నోటిఫైడ్ చేయని కె.ఎస్.కేర్ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు కోవిడ్ పేషేంట్స్ ఆక్సీజన్ అందక చనిపోయారని వార్తలు వచ్చిన సంఘటన పై తక్షణమే జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కె ఎస్ ఆర్ ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. డి.ఎం.హెచ్.ఓ.డా.రామ గిడ్డయ్య ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్, డాక్టర్ల బృందాన్ని కె.ఎస్.కేర్ ఆసుపత్రికి పంపి విచారణ విచారణ చేయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అక్ర‌మాలు నిర్దార‌ణ అయ్యాయ‌ని అన్నారు.. అలాగే ఇక్క‌డ చికిత్స పొందుతున్న క‌రోనా రోగుల‌ను ఇత‌ర హాస్ప‌ట‌ల్స్ కు త‌ర‌లించిన‌ట్లు చెప్పారు… నోటిఫై కాని క‌రోనా హాస్ప‌ట‌ల్స్ లో రోగులు చేర‌వ‌ద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement