Sunday, October 6, 2024

AP: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి…

నంద్యాల బ్యూరో, సెప్టెంబర్ 22 ప్రభ న్యూస్ : నంద్యాల జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది.. త‌నకు పెళ్లి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించిన కొడుకును తండ్రి కత్తితో పొడిచిన సంఘటన నంద్యాల జిల్లాలో ఆదివారం జ‌రిగింది. నంద్యాల మండలం భీమవరం గ్రామంలో త‌నకు వయసు మీరిపోతుంది.. తనకు పెళ్లి ఎందుకు చేయలేదని తండ్రి వెంకట సుబ్బారెడ్డిని శ్యామ్ అనే యువకుడు ప్రశ్నించాడు.

దీంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆవేశంలో ఆగ్రహానికి గురైన తండ్రి వెంకటసుబ్బారెడ్డి కొడుకును కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శ్యామ్ ను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తమై తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. నంద్యాల తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement