Friday, April 26, 2024

తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయడం కష్టం

ఆత్మకూరు (నంద్యాల జిల్లా) : పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమని, తల్లి పులి కోసం డ్రోన్ కెమెరాలతో అన్వేషణ కొనసాగిస్తున్నట్లు ఆత్మకూరు అటవీ డివిజన్ ఎఫ్.డి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామాల్లో పెద్ద పులి పిల్లలు లభ్యం పై అలా మాట్లాడుతూ.. తల్లి కి దూరమైన నాలుగు ఆడ పులి పిల్లలు అటవీ శాఖ అధికారులు సంరక్షణలో క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ఇక వీటి తల్లి పులి వయస్సు 8సం.లు ఉండుచున్నారు. తల్లిపులి టైగర్ నంబర్ 108 గా గుర్తించినట్లు తెలిపారు. పులి పిల్లలు లభ్యమైన ప్రాంతంలో తల్లి పులి అరుపులు సిబ్బంది విన్నారని, తల్లి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేం..
పిల్లలకు దూరమైన తల్లి పులి ప్రవర్తనను అంచనా వేయలేమని నాగార్జున ఫారెస్ట్ డివిజనల్ అధికారి వెల్లడించారు. చాలా ఉద్రేకంగా ఉంటుందన్నారు. కనుక అత్యంత జాగ్రత్తగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకే సారి నాలుగు పిల్లలకు పులి జన్మనివ్వడం అరుదు అన్నారు. పైగా ఆడ పులులు కావడం దేశ చరిత్రలోనే అత్యంత ఆశ్చర్యకర విషయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లి పులి కోసం ప్రత్యేక ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరా లతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రోన్లు అన్వేషణ కొనసాగుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా తల్లి వద్దకు పులి పిల్లలను చేర్చేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. దూరమైన పిల్లలను తల్లి పులి చేరదీస్తుందో లేదో చూసి, పిసిసిఎఫ్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన పై అటవీ శాఖ అధికారులు, స్వచంద సంస్థలతో కమిటీ వేశాం అన్నారు. తల్లి పులి జాడ లేకపోతే రెండేళ్లు సంరక్షించి అటవీ ప్రాంతంలో విడుదల చేస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement