Friday, October 4, 2024

KNL: కౌన్సిల్ భేటీలో.. ఎమ్మెల్యే vs ఛైర్మన్ వర్గాల మాటల యుద్ధం..

నందికొట్కూర్, సెప్టెంబర్ 29 (ప్రభ న్యూస్) : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఛైర్మన్ వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. మెజార్టీ సభ్యులు సభా సమయాన్ని ప్రజలకు ఉపయోగ పడేవిధంగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వర్గం త్వరగా వెళ్లాలని కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతుండగా.. చైర్మన్ వర్గం కౌన్సిలర్ లాలూ ప్రసాద్ మైకు మాకు కావాలని మధ్యలో మాట్లాడుతుండగా కౌన్సిలింగ్ మీటింగ్ మధ్యలోనే మాటలు యుద్ధం జరిగింది.

దీంతో మెజార్టీ కౌన్సిలర్లు అత్యవసర పనులకు మాత్రమే ఆమోదం తెలుపుతున్నామని మునిసిపల్ కమిషనర్ బేబీకి తెలపడం జరిగింది. ఈ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం, తమ సిబ్బందితో ఇరువురికి సర్ది చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement