Saturday, April 20, 2024

క్రీడలకు ప్రాముఖ్యత పెంచాలి : టీజీ భరత్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రాముఖ్యత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రగ్బీ సంఘం అధ్యక్షులు టీజీ భరత్ అన్నారు. శనివారం స్థానిక అవుట్డోర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ కోర్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా క్రీడా సంస్థ సీఈవో పి.వి.రమణ రాష్ట్ర రగ్బీ సంఘం కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, సౌత్ ఇండియా రగ్బీ డెవలప్మెంట్ మేనేజర్ నోయల్ డెవలప్మెంట్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదే చెందిన 52 మంది ఔత్సాహిక ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీజీ భరత్ మాట్లాడుతూ విదేశాల వలే భారతదేశంలోనూ క్రీడలకు ప్రాముఖ్యత పెంచాలని అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో క్రీడా సంస్థ సీఈవో వివి రమణ మాట్లాడుతూ రగ్బీ క్రీడల అభివృద్ధికి జిల్లా క్రీడా సంస్థ తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పాఠశాల స్థాయి నుండే కోచ్ విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలని.. వారికి కావలసిన సదుపాయాలను జిల్లా క్రీడా సంస్థ తరపున అందజేస్తామని ఆయన వివరించారు. అనంతరం టీజీ భరత్ రగ్బీఇన్ స్పెక్ట‌ర్ల‌ను కరచాలనం చేసుకుని పరిచయం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement