Thursday, April 25, 2024

సీమలో హైకోర్టు డిమాండ్ బీజేపీదే : మాజీ ఎంపీ టీజీ వెంక‌టేష్‌

కర్నూలు బ్యూరో : సీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ బీజేపీ దేనని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఆదివారం కర్నూల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు సంబంధించి బీజేపీ చేసినటువంటి డిక్లరేషన్ ప్రకారం పోరాటాలు చేస్తున్నామన్నరు. అలాగే ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా బీజేపీ దేనన్న విషయమును ఆయన గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మోడీ పలుకుబడి పెరిగిందన్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలో కూడా భారతీయులను రక్షించేందుకు చేసిన కృషి వెలకట్టలేనిదన్నారు. భారతీయులు ఉన్న ప్రాంతాలంతా యుద్ధం జరుగకుండా ఆపివేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. దేశంలో అవినీతి రహిత, స్వచ్ఛమైన పాలన మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమైన, భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రతిష్టంగా ఉందంటే అది మోడీ ఘనత పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ప్రజల సంక్షేమాన్ని చేపడుతూనే, మరోవైపు అభివృద్ధిని చేస్తుందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎలెక్షన్స్ లో విజయానికి కైవసం చేసుకునేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు.


విజ్ఞతతో ఆలోచించి ఓటెయ్యండి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టే బీజేపీని ఆదరించాలన్నారు. రాయలసీమ ప్రాంతం ఎంతో కొంత అభివృద్ధి జరిగింది అంటే అది కేవలం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వల్లనే అన్నారు. ఇప్పటికే ఇక్కడ ఎన్నో కేంద్ర ప్రాజెక్ట్ లో వచ్చాయి.. మౌలిక సదుపాయాలు కల్పనలో భారతీయ జనతా పార్టీ ముందుంటుందన్నారు. అటువంటి పార్టీకి ఆదరించి పట్టం కడితే మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.


కేసీఆర్ పార్టీ మట్టి కరవడం ఖాయం
కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు పోతున్నాడు.. బీజేపీ గాలిలో కేసీఆర్ పార్టీ కొట్టుకపోక తప్పదన్నారు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమంతో పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు పేరు మార్చిన బీఆర్ ఎస్ పార్టీ అయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి సమానం కాదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement