Friday, April 19, 2024

శ్రీశైలం జ‌లాశ‌యానికి భారీగా వ‌ర‌ద‌.. 10 గేట్లు ఎత్తివేత‌..

కర్నూల్ బ్యూరో : శ్రీశైలం డ్యాంకు వరద జోరు సాగుతుంది. ఎగువ తుంగభద్ర, జూరాల నుంచి కృష్ణ ప్రవాహం భారీగా చేరుతుంది. దీంతో శ్రీశైలం డ్యాం కు చెందిన 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,17,460 క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు వదులుతున్నారు. ఇదే సమయంలో ఏపీ పవర్ హౌస్ నుంచి 30, 861 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 14.972, తెలంగాణ పరిధిలోని ఎడమ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీరు వినియోగంతో 16,822 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక శ్రీశైలం జలాశయ నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.40, జలాశయం లో నీటి నిల్వలు 215 టీఎంసీలకు గాను, 212 టీఎంసీల నీరు నిల్వ ఉంచారు. ఇక జలాశయానికి జూరాల నుంచి 51,410 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజ్ నుంచి 83034 క్యూసెక్కుల చొప్పున మొత్తం 3,55,398 క్యూసెక్కుల నీరు డ్యాంకు చేరుకుంటుంది. ఇదే సమయంలో డ్యాం నుంచి మొత్తం 3,92,575 క్యూ సెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. ఇదే సమయంలో ఏపీ పరిధిలోని హంద్రీనీవాకు 1674 క్యూ సెక్కులు, పోతిరెడ్డిపాడుకు 14,000 క్యూ సెక్కులు విడుదలవ్వడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement