Saturday, April 13, 2024

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం : శ్రీ‌శైలం మ‌ల్లికార్జున స్వామివారి ఆల‌యంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా సోమ‌వారం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వ‌హించారు. సాయంకాలం హంస వాహనసేవ ఉంటుంద‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీ హోమం, జపాలు, పారాయణలు చేయ‌నున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం తరుపున పట్టువస్త్రాల స‌మ‌ర్పించారు. సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం జ‌ర‌గ‌నుంది. గ్రామోత్సవంలో పలు సంప్రదాయ జానపద కళారూపాల ప్రదర్శన ఉంటుంద‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదిక వద్ధ, పుష్కరిణి వేదిక వద్ద, శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాల నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement