Thursday, April 25, 2024

మంచి చిత్రాలకు ప్రేక్షక ఆదరణ ఎప్పటికీ ఉంటుంది – టీజీ వెంకటేష్

మంచి కథనంతో నిర్మించే చిత్రాలకు ప్రేక్షకు ఆదరణ ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు సంకల్ బాగ్ నందుగున్న టీజీ వెంకటేష్ స్వగృహం నందు నేను మీకు బాగా కావలసిన వాడిని చిత్రం ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ… ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ సమర్పణలో ఆయన కూతురు దివ్య నిర్మిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా టైటిల్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందన్నారు. ప్రస్తుతం కుటుంబ కథ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని అటువంటి చిత్రాలన్నీ నిర్మించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దివ్య దీప్తి, దర్శకుడు గాడే శ్రీధర్, నటులు కిరణ్ అబ్బవరం, సంజన, సోను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement