Monday, October 7, 2024

KNL: ఈవీఎం వేర్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

కర్నూలు బ్యూరో : త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవిఎంలు భద్రపరచిన వేర్ హౌస్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పరిశీలించారు. శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం వేర్ హౌస్ లో ఈవీఎంలను భద్రపరచిన తీరును కలెక్టర్ పరిశీలించారు..

ఈవీయం వేర్ హౌస్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం సంబంధిత రిజిస్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు.

- Advertisement -

కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చిరంజీవి, ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ మురళి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ ఎల్.వి.ప్రసాద్, బీజేపీ స్టేట్ ఎలక్షన్ సెల్ ప్రతినిధి సాయి ప్రదీప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె.పుల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సాయి కృష్ణ యాదవ్, బీఎస్పీ ప్రతినిధి లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement