Wednesday, April 24, 2024

అటవీశాఖ అధికారులకు తుపాకుల పంపిణీ

నాగార్జునసాగర్ -శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో ని అటవీ అధికారుల కు డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేష్ అప్పావు ఐఎఫ్ ఎస్ వారి చేతుల మీదుగా తుపాకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాకులు ఇవ్వటం వలను రేంజ్ స్థాయి సిబ్బoది మరింత సమర్ధవంతంగా అడవులు వన్యప్రాణుల రక్షణలో పనిచేస్తారు అని తెలిపారు. తుపాకులు అందుకున్న వారిలో డిప్యూటీ రేంజ్ అధికారులు అరిఫ్ ఖాన్, ముక్కు ప్రసాద రెడ్డి, రామ్మోహన్ రావు, సెక్షన్ అధికారులు చెన్నయ్య, శ్రీను, అటవీ బీటుఅధికారులు వెంకటేశ్వర్లు, భానుప్రసాద్, రోశయ్య, గురవయ్య, ధనలక్ష్మి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement