Thursday, April 25, 2024

కె ఎస్ కేర్ హాస్పటల్ యాజమాన్యం పై క్రిమినల్ చర్యలు..కలెక్టర్

కర్నూలు నగరంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్ కు ట్రీట్మెంట్ ఇచ్చిన కె.ఎస్.కేర్ ఆసుపత్రిని సాయంత్రం తనిఖీ చేసి వివరాలను స్వయానా తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రభుత్వ అనుమతి లేని కర్నూలు నగర కె.ఎస్. కేర్ ప్రవేట్ కోవిడ్ ఆసుపత్రిలో ఈ రోజు ఆక్సీజన్ కొరత తో కొందరు కోవిడ్ పేషేంట్స్ మృతి చెందారు అని కొన్ని మీడియా చానెల్స్ వచ్చిన వార్త నిజం కాదన్నారు.. తాను నియమించిన డిఎంహెచ్ఓ, డాక్టర్లు, డ్రగ్ కంట్రోల్ ఎడి బృందం ఎంక్వయిరీ టీమ్ వెంటనే కె.ఎస్.కేర్ ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక విచారణ చేసి నివేదిక ద్వారా వివరాలు అంద జేసిన్నటు జిల్లా కలెక్టర్ వెల్లడి ఇంచారు. అయినా ముందు జాగ్రత్తగా కె.ఎస్.కేర్ ఆసుపత్రిలో ఉన్న పేషేంట్స్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి జిజిహెచ్ కు అంబులెన్స్ లలో తరలించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
కర్నూలు డ్రగ్ కంట్రోల్ ఏ.డి.ఇచ్చిన నివేదిక ప్రకారం కర్నూలు ఆర్.ఎస్.గ్యాస్ సంస్థ ద్వారా కె.ఎస్.కేర్ ప్రవేట్ ఆసుపత్రికి గత రెండు రోజులలో 122 మెడికల్ ఆక్సీజన్ సీలిండర్స్ ను సరఫరా చేశారననారు. .ఈ రోజు ఉదయం 5 ..తిరిగి మద్యాహ్నం 9 మెడికల్ ఆక్సీజన్ సిలెండర్స్ ను కర్నూలు ఆర్.ఎస్.గ్యాస్ సంస్థ ద్వారా కె.ఎస్.కేర్ ప్రవేట్ ఆసుపత్రి తీసుకున్నట్లూ విచారణలో తేలిందనీ. కాబట్టి ఆక్సీజన్ కొరత లేదని డి.ఎం.హెచ్.ఓ డాక్టర్స్ బృందం, డ్రగ్ కంట్రోల్ ఏ.డి.తెలిపారు…చికిత్స వివరాలపై నిపుణుల డాక్టర్ల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేయిస్తా మన్నారు.
ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్ ను అనధికారికంగా అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చిన కె.ఎస్.కేర్ ఆసుపత్రి యజమాన్యంపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసు బుక్ చేశామన్నారు. తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కర్నూలు నగరంలో ఇలాగే చేసిన ఒక ప్రవేట్ ఆసుపత్రి ఎండీ ను కూడా ఇటీవల అరెస్ట్ చేశామని కలెక్టర్ గుర్తు చేశారు.
కోవిడ్ పేషేంట్స్ కు ఆక్సీజన్ లేదు అనే పుకార్లను ఎవరైనా సృష్టిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనారు. ప్రజలూ పుకార్లను నమ్మవద్దు..జిల్లాలో ప్రభుత్వం నోటిఫై చేసిన 28 కోవిడ్ ఆసుపత్రుల్లో ఎటువంటి బెడ్స్ గాని, ఆక్సీజన్ కొరత గానీ లేదనీ కలెక్టర్ తెలిపారు. అలాగే కర్నూలులో కొవిడ్ చికిత్సకు అనుమతి పొందిన హాస్పటల్స్ వివరాలను విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement