Wednesday, December 11, 2024

క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో 15మందికి క‌రోనా

ఆంధ్రప్ర‌దేశ్‌ రాష్ట్రంలో రోజురోజుకు క‌రోనా విజృంభిస్తోంది. రోజులు గ‌డిచేకొద్దీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా క‌ర్నూలు మెడిక‌ల్ కాలేజీలో 15 మంది వైద్య విద్యార్థుల‌కు క‌రోనా సోకింది. మొత్తం 50 మంది వైద్య విద్యార్థుల‌కు క‌రోనా నిర్థార‌ణ పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఎంబీబీఎస్ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్న 11 మంది విద్యార్థుల‌కు, న‌లుగురు హౌస్ స‌ర్జ‌న్‌ల‌కు క‌రోనా సోకింది. మ‌రో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్‌ను సేక‌రించి ల్యాబ్‌కు పంపారు. మెడిక‌ల్ కాలేజీలోని విద్యార్థుల‌కు క‌రోనా సోక‌డంతో అధికారులు అప్ర‌మ‌త్తమ‌య్యారు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన విద్యార్థుల‌ను ఐసోలేష‌న్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement