Thursday, April 25, 2024

Breaking : ఏసీబీ వలలో ఎస్సై శివాంజ‌నేయులు-విచారిస్తోన్న అధికారులు

ఇంటి స్థలం వివాదంలో బాధితులకు న్యాయం చేస్తానని లంచం డిమాండ్ చేసిన ఎస్ ఐని కర్నూలు జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సిని ఫ‌క్కీలో జరిగిన ఈ ఘటనలో సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కోడుమూరు నియోజకవర్గం, సి బెళగల్ మండలంకు చెందిన ప్రకాష్ ఆచారి అనే వ్యక్తి తన ఇంటి పక్క స్థల వివాదంలో ఈ బెళగల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. అక్కడ ఎస్సై శివాంజనేయులుని స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. అందుకు సంబంధించి డాక్యుమెంట్లను చూపారు. అయితే ఆ స్థల వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగు తిన్న ప్రకాష్ ఆచారి ఆ సొమ్ము ఇచ్చేందుకు మొదట నిరాకరించాడు. ఆ తర్వాత ఈ విష‌యాన్ని కర్నూల్ అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించి వారి దృష్టికి తీసుకెళ్లాడు.

అనంతరం ఎసిబి డిఎస్పి శివ నారాయణ స్వామి ఆదేశాల మేరకు సి బెళగల్ ఎస్సై శివ రామాంజనేయులు కు మొదట చేసుకున్న ఒప్పందం మేర‌కు సొమ్ము ఇచ్చేందుకు అంగీకరించాడు. లంచం డబ్బును ముట్ట చెప్పడంలో భాగంగా కర్నూలు కలెక్టరేట్, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలోని మాంటిస్సోరి స్కూలు వద్ద రూ. 50 వేలు ఇచ్చేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు. అక్కడికి వచ్చిన ఎస్ఐ రూ 50 వేలు లంచం తీసుకుంటుండగా ..అప్పటికే అక్కడ మాటివేసిన ఏసీబీ పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొదట ఆ సొమ్ము తనది కాదంటూ రోడ్డుపై పారేసిన ఎస్సై మొరాయించినప్పటికీ ఆ తర్వాత అంగీకరించక తప్పలేదు. ఎస్ఐనీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు మాంటిస్సోరి స్కూలుకి తీసుకెళ్లి విచారణ చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement