Thursday, February 2, 2023

జోగుళాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాల‌ని ప్రముఖులకు ఆహ్వానం

అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తు గురువారం కలెక్టర్ కోటేశ్వర రావు, ఎస్పీ సిద్దార్ధ కౌశల్, ఎంపీ సంజీవ్ కుమా, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని ఆల‌య అధికారులు కలిశారు. ఈ మేరకు జోగుళాం ఆలయ ఇఓ పురేంధర్ కుమార్, చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ముఖ్య అర్చకులు ఆనంద్ శర్మలు కలసి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను, ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని 26వ తేదీ వసంత పంచమి సందర్భంగా జోగులాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని, జోగులాంబ అమ్మవారి దర్శించుకోవాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement