Sunday, March 24, 2024

కొవిడ్ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలి

కర్నూల్ ఎడ్యుకేషన్, – స్థానిక ఏ ఐడిఎస్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న కరోనా నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు, ప్రిన్సిపల్స్, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో సమీక్షించి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని_ ఏ ఐ డి ఎస్ ఓ రాష్ట్ర కార్యదర్శి వి. హరీష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉధృతంగా మారుతోంది… రోజూ రోజుకి కూడా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ 8000 కేసులు నమోదు అవుతున్నాయని, అంతేగాకుండా ఈ కేసులు విద్యార్థులలో ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపారు… ముఖ్యంగా కర్నూల్ జిల్లాలోని గత కొన్ని రోజులుగా కేజీబీవీ స్కూళ్లలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయనే విషయం మన అందరికి కూడా తెలిసిందే… ఈ రోజు కూడా ఆదోని లోని కే జి బి స్కూల్ లోని 52 మంది విద్యార్థులకు, అలాగే ప్రిన్సిపాల్ కూడా అస్వస్థతకు గురయ్యారని, మరియు జిల్లాలోని దొర్నిపాడు మండలంలోని అమ్మిరెడ్డి నగర్ లోని కే జి బి స్కూల్ లో కూడా 35 మంది విద్యార్థులకు కరోనా సోకిందని అన్నారు… ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి, వెంటనే స్పందించి విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని, అలాగే జిల్లాలోని అన్ని కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు… అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరియు జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ముఖ్యమైన అధికారులు, ప్రిన్సిపల్స్, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో సమీక్షించి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేసింది. కార్యక్రమంలో ఏ ఐడి ఎస్ ఓ జిల్లా ఇంచార్జీ పి. విశ్వనాథ్ రెడ్డి, ప్రియాంక, మనోహర్ పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement