Saturday, June 12, 2021

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయం.. కర్నూలు పోలీసుల ఔదార్యం

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి కర్నూలు పోలీసులు మరోసారి తమ ఔదార్యం చాటుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన సంజీవకుమార్ అనే వ్యక్తి  తన కారులో ఉదయం ప్రొద్దుటూరు నుండి హైదరబాద్ కు కర్నూలు మీదుగా వెళుతున్నాడు. ఈ క్రమంలో ఓర్వకల్లు సమీపంలోని హుస్సేనా పురం దగ్గర సంజీవకుమార్  కారులో ప్రయాణిస్తూ ఎస్ ఆర్ పెట్రోల్ బంకు దగ్గర నిద్ర మత్తులో కారుతో పాటు కల్వర్టు క్రింద పడి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అతని తలకు,  ఎడమకాలుకు తీవ్ర గాయం అయింది.

ఈ రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్నిఓ విద్యార్థి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం తెలుసుకున్న  హైవే పెట్రోలింగ్ ఒర్వకల్లు  పోలీసులు ప్రమాద సంఘటన స్ధలానికి చేరుకుని క్షతగాత్రులకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్వరమే స్పందించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన  క్షతగాత్రులకు సహాయపడి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. సంఘటనపై స్పందించిన పోలీసులను జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప  అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News