Friday, October 4, 2024

AP: కుంగిన అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ కట్ట..

అవుకు (నంద్యాల జిల్లా) : అవుకు తిమ్మరాజు రిజర్వాయర్ పాత తూము వద్ద ప్రమాదకరంగా రాతికట్టడం కట్ట కుంగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

బుధవారం రిజర్వాయర్ లో పూర్తి నీటి సామర్థ్యం 4.148 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నాలుగు టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఎస్ఆర్ బీసీ అధికారులు తెలిపారు. నాలుగు సంవత్సరాల తర్వాత జల వనరుల శాఖ అధికారులు 4 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. రిజర్వాయర్ ప్రధాన ఆనకట్ట కుంగిన విషయం తెలిసినా కూడా ఎస్ఆర్ బీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోలేదు. అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement